+91 83408 34108

తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్

(Regd: 1358/16)

'మానవ సేవే మాధవ సేవ' 'అని నమ్మి మేము తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ ను 2016 లో స్థాపించాము. నిరుపేదలకు సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఫౌండేషన్ ను స్థాపించడం జరిగింది. ఆర్థికంగా వారికి తోచినంత సహాయం చేస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం. బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించడం, పేదలకు రైస్ ని డొనేట్ చేయడం తో పాటు.. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వైద్య ఖర్చులు పెట్టుకోలేని వారికి ఫండింగ్ ద్వారా వారికి అయ్యే వైద్య ఖర్చులకు సహాయం చేయడం ఈ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ముఖ్య కార్యక్రమాలు.

తోటి వారికి సహాయం చేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానిస్తున్నాము.


నిరుపేదలకు ఆర్థిక సహాయం

ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆర్థికంగా వారికి సహాయం చేస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం

నిరుపేదల వైద్య ఖర్చులు

ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వైద్య ఖర్చులు పెట్టుకోలేని వారికి ఫండింగ్ ద్వారా వారికి అయ్యే వైద్య ఖర్చులకు సహాయం చేయడం

రక్త దాన శిబిరాలు

రక్తం అవసరమయ్యే వారికి రక్త దాతలు ప్రాణదాతలతో సమానమని నమ్మి రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.

రైస్ డొనేషన్

రెక్కాడితే కానీ డొక్కాడని పేదలకు, అప్పనహస్తం కోసం ఎదురు చూస్తున్న వారికి నెల నెల రైస్ ని డొనేట్ చేయడం


  • img
    సీఎం రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని అందించి శుభాకాంక్షలు తెలియజేసిన TYCF వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డా,, కర్నాల అనిల్ కుమార్ ముదిరాజ్ గారు
  • img
    రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో అనారోగ్యంతో మరణించిన వంగళ మురళి కుటుంబ సభ్యులను పరామర్శించి 25kg రైస్ బ్యాగ్ అందివ్వడం జరిగింది
  • img
    రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందిన పంబాల భూమయ్య కుటుంబాన్ని పరామర్శించి 25kg రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది
  • img
    దాతల సహాయసహకారాలతో అన్నదాన కార్యక్రమం ప్రారంభించాము
  • img
    రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన ముకుందు అనిల్ అనే యువకునికి వైద్య ఖర్చుల నిమిత్తం 13,000/-రూ,, ఆర్థిక సహాయం అందివ్వడం జరిగింది
  • img
    జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన తాళ్ళ సుధాకర్ అనే మతిస్థిమితం లేని వ్యక్తికి వైద్య ఖర్చుల నిమిత్తం 20,000/- రూ,, ఆర్థిక సహాయం అందివ్వడం జరిగింది
  • img
    సిద్దిపేట జిల్లా బేజ్జంకి మండల కేంద్రలోని నిరుపేద కుటుంబానికి చెందిన రాంపూరి లక్ష్మి(శైలు) వివాహానికి తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ సభ్యుల సహకారంతో 8016/- రూపాయల ఆర్థిక సహాయం అందివ్వడం జరిగింది
  • img
    డాక్టరేట్ వచ్చిన సందర్బంగా TYCF వ్యవస్థాపకులు అనిల్ కుమార్ ముదిరాజ్ గారిని వేములవాడ పట్టణ ఉప్పుగడ్డ ముదిరాజ్ సంఘం నాయకులు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ నాయకులు రేగుల శ్రీధర్ రేగుల నరేష్ పిల్లి సిద్ధార్థ గోనె ప్రభాకర్ ఉప్పుల కిషన్ రేగుల సాయి తదితరులు పాల్గొన్నారు
  • img
    మహాత్మా గాంధీ 150వ జయంతి మరియు సద్భావన ఫోరమ్ 5 వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు కరీంనగర్ పట్టణంలో సద్భావన ఫోరమ్ వారు తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను ఆత్మీయ సద్భావన స్ఫూర్తి అవార్డుకు ఫౌండేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కర్నాల అనిల్ కుమార్ ముదిరాజ్ గారికి అందివ్వడం జరిగింది.
  • img
    తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న సోషల్ సర్వీస్ మరియు హెల్త్ కేర్ సర్వీస్ కు గాను ఢిల్లీ లో మ్యాజిక్ & ఆర్ట్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ అవార్డు ను తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కర్నాల అనిల్ కుమార్ ముదిరాజ్ గారికి అందివ్వడం జరిగింది.
  • img
    తెలంగాణ క్రికెట్ ఆకాడమికి ఎంపికైన నిరుపేద క్రీడకారునికి ఆర్థిక సహాయం అందజేత జగిత్యాల జిల్లా భీమరం మండలం లింగంపేట గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన *నిమ్మల కళ్యాణ్* క్రీడల్లో రాణించి *తెలంగాణ క్రికెట్ అకాడమీ* సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఈ నెల 25 నుండి 31 వరకు ఢిల్లీ,గోవా లో జరిగే క్రికెట్ మ్యాచ్ ఆడాటనీకి ఆర్థిక సహాయం 5500/- రూ,, లను ఫౌండేషన్ కార్యాలయం లో రాష్ట్ర P.R.O దుద్దేటి రాకేష్ చేతులమీదుగా నిమ్మల కళ్యాణ్ కి అందివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సాయి,శివరాం పాల్గొన్నారు.
  • img
    STATE BEST CITIZEN OF TELANGANA AWARD-2023(SOCIAL SERVICE) అవార్డు ను అందుకున్న TYCF వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కర్నాల అనిల్ కుమార్ ముదిరాజ్ గారు... నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నందమూరి తారకరామారావు కళామందిరంలో అర్పిత సాహిత్య ,సాంఘిక స్వచంద సేవ సంస్థ 22వ వార్షిోత్సవ మహోత్సవ ఆత్మీయ పురస్కారం లో STATE BEST CITIZEN OF TELANGANA AWARD-2023(SOCIAL SERVICE) అవార్డు ని తెలంగాణ రాష్ట్ర BC కమీషన్ చైర్మన్ వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్ రావు, TS IDC చైర్మన్ వేణుగోపాలచారి గార్ల చేతుల మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు కర్నాల అనిల్ కుమార్ ముదిరాజ్ కు అందివ్వడం జరిగింది. తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ ద్వారా చేస్తున్న అనేక సేవ కార్యక్రమాలను చూసి ఇ అవార్డు అందించారు
  • img
    జగిత్యాల జిల్లా మాల్యాల మండల కేంద్రానికి చెందిన జిల్లా మీనాక్షి కి కిడ్నీలు చెడిపోయి అనారోగ్యంతో బాధపడుతుంటే 20,000/- రూ,, ఆర్థిక సహాయాన్ని మాల్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో అందివ్వడం జరిగింది.
  • img
    రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన తిప్పారపు దేవయ్య గారు పక్షవాతంతో బాధపడుతూ మరణించడం తో తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10,000/-రూ,, ఆర్థిక సహాయం రాష్ట్ర P.R.O దుద్దేటి రాకేష్ చేతుల మీదుగా అందివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కొంపెళ్లి ప్రశాంత్,రమేష్,సాయి పాల్గొన్నారు.
  • img
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీ పేట గ్రామానికి చెందిన సూర మహేష్ గారి కుమారుడు రియన్ష్ పుట్టుకతోనే గుండె కి రంద్రం ఉంది. గుండె ఆపరేషన్ చేయించడానికి ఆరోగ్యశ్రీ లో చేయడానికి హాస్పిటల్ యాజమాన్యం ముందుకు రావడం జరిగింది. బెడ్ చార్జీలు మరియు మందులకి అయ్యే ఖర్చుల నిమిత్తం తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో 11,000/-రూ,, ఆర్థిక సహాయం రాష్ట్ర P.R.O దుద్దేటి రాకేష్ చేతుల మీదుగా అందివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఏక్సిక్యూటివ్ మెంబెర్స్ పసుల అంజి బాబు,వివేక్,రిక్కి వేణు మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
  • img
    జగిత్యాల జిల్లా మాల్యాల మండల కేంద్రానికి చెందిన ఐతరవెని రమేశ్ ఇటీవల వడదెబ్బ కారణంగా మృతి చెందడం తో వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ తెలంగాణ యూవచైతన్య ఫౌండేషన్ మల్యాల మండల అధ్యక్షులు కీసరి గణేష్ (ఆర్మీ) గారు మరియు ఫౌండేషన్ సభ్యుల సహకారంతో Rs.17,450/ రూ,, లను వారి ఇద్దరి ఆడపిల్లలకు పోస్ట్ ఆఫీస్ లో మహిళ సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ లో డిపాజిట్ చేసి వారికి బాండు పేపర్లు అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షులు బొజ్జ నర్సయ్య ముదిరాజ్, గంగిపెల్లీ దినేష్(ఆర్మీ), దొంతరవేణి శేకర్ , మ్యాదరి లవన్ కుమార్, నీలం రవి, సంసొద్దిన్, గాజుల అనిల్,గడుగు అంజి, గంగ నర్సయ్య, కోయిల మల్లేశం, బొజ్జ గంగాధర్ మరియు తెలంగాణ యూవ చైతన్య ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
  • img
    న్యూస్ క్లిప్స్
  • img
    గ్రామపంచాయతీ కార్మికుడు బాలయ్య మృతి చెండంతో వారి కుటుంబానికి TYCF మాల్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం న్యూస్ పేపర్ క్లిప్స్
  • img
    జగిత్యాల జిల్లా మాల్యాల మండల కేంద్రంలో ని గ్రామ పంచాయతీ లో పనిచేస్తున్న బాలయ్య మృతి చెందడం తో వారి కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ మల్యాల మండల అధ్యక్షుడు కీసర గణేష్ (ఆర్మీ) మరియు ఫౌండేషన్ సభ్యుల సహకారంతో Rs.10,000/- రూ,,ల ఆర్థిక సహాయం అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షులు బొజ్జ నర్సయ్య ముదిరాజ్, జవ్వాజి రాజ్ కుమార్, దొంతరవెని శేకర్ ,కొరిపు వెంకటేష్, నీలం రవి, గడుగు సాయి రఘు, ముకుందు మనోజ్, మ్యాదరి లవన్ కుమార్ మరియు తెలంగాణ యూవ చైతన్య ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు
  • img
    జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టపూర్ గ్రామానికి చెందిన మైలారపు శివ తేజ బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నాడు ఇట్టి నిరుపేద కుటుంబానికి తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ సౌదీ NRI సెల్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేసేలోపే శివ తేజ మరణించడం జరిగింది. వాళ్ళ చెల్లె మైలారపు పల్లవి భవిష్యత్ కోసం అట్టి ఆర్థిక సహాయాన్ని పల్లవి పేరుమీద బ్యాంక్ లో 21000/-రూపాయలు ఫిక్సిడ్ డిపాసిట్ చేసి ఈ రోజు పల్లవి వాళ్ల నాన్నకు బాండ్ పేపరను తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ సౌదీ NRI సెల్ ఉపాధ్యక్షుడు చౌటకూరి మహేంధర్ చేతులమీదుగా అందివ్వడం జరిగింది వారితో పాటు చౌటుకూరి రాజా నర్సయ్య గారు పాల్గొన్నారు
  • img
    జగిత్యాల జిల్లా మాల్యాల మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన సేనవేణి లక్ష్మీ వివాహానికి తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ మాల్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో 10000/- ఆర్థిక సహాయం ఫౌండేషన్ వ్యవస్థాపక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కర్నాల అనిల్ కుమార్ ముదిరాజ్ గారి చేతుల మీదుగా అందివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో TYCF రాష్ట్ర P.R.O దుద్దేటి రాకేష్,TYCF మాల్యాల మండల కమిటీ సభ్యులు బొజ్జ నర్సయ్య,వెంకటేష్, శేఖర్,గంగానర్సయ్య, శ్రీనివాస్,రఘు,జ్యోతి-గణేష్,వివేక్, రాజేష్(రిక్కి) తదితరులు పాల్గొన్నారు.
  • img
    తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ క్యాలెండర్ ని హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో ప్రభుత్వ విప్ MLA బాల్క సుమన్ గారు ఆవిష్కరించడం జరిగింది.
  • img
    నవంబర్ నెల 15 తేదీ నాడు సౌదీ లో గుండెపోటుతో అకాల మరణం చెందిన *మోగిల్లా శ్రీను గ్రామం గోవిందరం మండలం భీమారం*. కుటుంభం రెక్కాడితే గాని కడుపు నిండని పరిస్థితి ఇప్పటికీ చాలా అప్పులు ఉన్నాయి ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి చూసి సౌదీ మిత్రులు *తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ సౌదీ NRI సెల్ అధ్యక్షుడు గంప నవీన్ గారి* ఆధ్వర్యంలో *ఇండియాలో తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్* సభ్యుల సహకారంతో ఆర్థిక సహాయం *13000/-* రూపాయలు పంపించడం జరిగింది ఇట్టి రూపాయలను నేడు వారికి కుటుంభానికి అందజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ *యువ చైతన్య ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల వంశీ, కథలాపూర్ మండల అధ్యక్షులు పాలేపు మహేష్*మహేందర్ జిల్లా కమిటీ సభ్యులు నేమూరి శ్రీధర్, కోటి అరుణ్, నేమూరి నరేందర్ , కల్లెం రవి, తొట్ల అనిల్ పాల్గొన్నారు
  • img
    తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ నూతన క్యాలెండర్లను యూత్ ఐకాన్ క్రౌడ్ కింగ్ దగడ్ సాయి అన్న గారు ఆవిష్కరించడం జరిగింది.
  • img
    తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ క్యాలెండర్ ని హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో ప్రభుత్వ విప్ MLA బాల్క సుమన్ గారు ఆవిష్కరించడం జరిగింది.

More Gallery

We Need Your Help


తోటి వారికి సహాయం చేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానిస్తున్నాము.




Newsletter Subscription

Our Team


Sainagar,Vemulawada, Rajanna Sircilla Dist., Telangana - 505302

Office: +91 8340834108,
PRO : +91 8466090992
President : +91 9949017888